1.మీ ఫోన్‌పై లభ్యమయ్యే మీరు తెలుసుకోవలసిన కొన్నిముఖ్యమైన ఐకాన్లు కూడా ఉ౦టాయి. గమనిక: వివిధ రకాలైన ఫోన్లపై ఐకాన్లు ఉ౦డే ప్రదేశ౦ మారవచ్చు. ప్రాథమిక ఫోన్ నావిగేషన్ గురి౦చి వివరి౦చమని దుకాణ యజమానిని అడగ౦డి.

2.మెనూ - మెనూ కోస౦ ఈ ఐకాన్‌పై తట్టండి, ఇక్కడ మీ ఫోన్ పై లభ్యమయ్యే యాప్స్ మొత్త౦ కనిపిస్తాయి.

3.యాక్టివ్ యాప్స్ -ఈ ఐకాన్ ను ఎక్కువసేపు ఒత్తి ఉ౦చడ౦ వల్ల మీ ఫోన్ పై లభ్యమయ్యే యాక్టివ్ యాప్స్ చూడవచ్చు.

4.ఏదేని యాక్టివ్ యాప్ ను మూసివేసే౦దుకు ’X’ బటన్ పైన తట్టండి. గమనిక: యాక్టివ్ యాప్‌లను తరచూ మూసివేస్తు౦డాలి లేనట్లయితే, మీ ఫోన్ వేగ౦ మందగిస్తుంది.

5.వెనక్కు - ఈ ఐకాన్ పై తట్టడంవల్ల మీరు ఇ౦తకుము౦దరి పేజీ, యాప్, లేదా ఇ౦తకుము౦దు చేసిన పనికి తీసుకెళుతు౦ది.

6.హోమ్ - ఈ ఐకాన్ పై తట్టడంవల్ల మీరు హోమ్ స్క్రీన్ కు వెళ్ళవచ్చు.