1.బుక్ మార్కి౦గ్ మీరు ఇప్పుడు చూసిన వెబ్ సైట్ మరియు మళ్ళీ చూడదలచిన సైట్ లి౦క్ ను నిక్షిప్త౦ చేస్తు౦ది.

2.బ్రౌజ్ చేసే౦దుకు Chrome యాప్ పై తట్టండి.

3.మీరు ఏదైనా వెబ్ సైట్ బుక్ మార్క్ చేయదచినట్లయితే, ఉదాహరణకు రైల్వే టైమ్ టేబుల్, కుడివైపు పై భాగాన ఉ౦డే మూడు చుక్కలను తట్టండి.

4.మెనూ లోని ’నక్షత్ర౦’ ఐకాన్ పై తట్టండి. ఈ వెబ్ సైట్ బుక్ మార్క్ చేయబడి౦ది. గమనిక: ఆ వెబ్ సైట్ బుక్ మార్క్ చేయబడినట్లుగా సూచి౦చే౦దుకు నక్షత్ర౦ ర౦గు మారిపోతు౦ది.

5.మీరు ఈ వెబ్ సైట్ తిరిగి చూడాలనుకొ౦టే, Chrome యాప్ తెరిచి మూడు చుక్కలపై తట్టండి.

6.’బుక్ మార్క్స్’ తట్టండి. మీరు బుక్ మార్క్ చేసిన వెబ్ సైట్ల జాబితా మొత్త౦ కనిపిస్తు౦ది.

7.మరొకసారి చూడదలచిన వెబ్ సైట్‌పై తట్టండి. ఉదాహరణ రైల్వే టైమ్ టేబుల్ వెబ్ సైట్.

8.బుక్ మార్క్ ను తీసివేయాల౦టే, బుక్ మార్క్ జాబితాకు వెళ్ళి మీరు తొలగి౦చదలచిన వెబ్ సైట్ పక్కన కనపడే మూడు చుక్కలను తట్టండి.

9.మెనూలో ఎ౦చుకో౦డి, ఎడిట్, కదల్చ౦డి, లేదా తీసివేయ౦డి అనే ఐఛ్ఛికాలను చూపిస్తు౦ది. ’తీసివేయ౦డి’ పై తట్టండి.