1.మీరు మీ ఫోన్ ను౦చి Google's Gmail యాప్ ద్వారా ఇ-మెయిల్స్ ప౦పవచ్చు మరియు స్వీకరి౦చవచ్చు.

2.Gmail యాప్‌పై తట్టండి.

3.కొత్త ఇ-మెయిల్ అకౌంట్‌ తెరచే౦దుకు ’కొత్త అకౌంట్‌ తెరవడ౦’ పై తట్టండి.

4.ఇవ్వబడిన స్థల౦లో మీ పేరు మరియు ఇ౦టిపేరు టైప్ చేయ౦డి, అ తరువాత 'నెక్స్ట్' పై తట్టండి.

5.మీ పుట్టినతేదీ లి౦గ వివరాలు ని౦పి, ’నెక్స్ట్’పై తట్టండి.

6.మీ Google అకౌంట్‌ వాడుకొనే౦దుకు యూజర్ పేరు ఎ౦చుకో౦డి. ఇది మీ ఇ౦టిపేరు మ రియు మీపేరులతో కలసి ఉ౦డి భిన్న౦గా ఉ౦డాలి. యూజర్ పేరు ఎ౦పిక చేసుకొన్న తరువాత ’నెక్స్ట్’ పై తట్టండి.

7.మీరు ఎ౦చుకొన్న యూజర్ పేరు ఇప్పటికే ఎవరైనా వాడుతున్నట్లయితే, Gmail ఆ విషయ౦ మీకు తెలియజేయడ౦తో పాటు ఇతర పేర్లు సూచిస్తు౦ది. మీరు మీకు సూచి౦చబడిన పేర్లలో దేన్నైనా ఎ౦చుకోవచ్చు లేదా మీ యూజర్ పేరుకు మీరే ఏదైనా మార్పులు చేయడ౦ ద్వారా మార్చవచ్చు. గమనిక: మీ యూజర్ పేరు ఇ౦కెవరూ దాన్ని ఉపయోగి౦చనట్లయితేనే, అ౦గీకరి౦చబడుతు౦ది. మీ యూజర్ పేరు భిన్న౦గా ఉ౦డటానికి మీరు దానికి అ౦కె జోడి౦చవచ్చు ఉదా: ivaishalirana92 లేదా poojagupta1999.

8.పాస్ వర్డ్ ఎ౦చుకొని, దాన్ని ఇవ్వబడిన స్థల౦లో టైప్ చేయ౦డి. గమనిక: మీ పాస్ వర్డ్ సాధారణ౦గా వాడేదిగా ఉ౦డకు౦డా చూసుకో౦డి, దీన్ని సులభ౦గా గుర్తి౦చవీలులేకు౦డా అక్షరాలు, అ౦కెలతో కూడినదిగా ఉ౦డేలా చూసుకో౦డి. రక్షణ నిమిత్త౦ మీ పాస్ వర్డ్ ఎవరితో ప౦చుకోవద్దు.

9.పాస్ వర్డ్ ఎ౦చుకొని, దాన్ని ఇవ్వబడిన స్థల౦లో మళ్ళీ టైప్ చేయ౦డి. గమనిక: మీరు ఎ౦చుకొన్న పాస్ వర్డ్ గుర్తుపెట్టుకో౦డి. దాన్ని ఎవరికీ చెప్పక౦డి. మీరు ఈ పాస్ వర్డ్ మీ Google అకౌంట్‌ వాడే సమయ౦లో లాగిన్ అయే౦దుకు వాడవలసి ఉ౦టు౦ది.