1.Play Store మీ ఫోన్ పై యాప్‌లకు మార్కెట్ ప్లేస్ లాగా పనిచేస్తు౦ది. మీరు ఇక్కడ రకాలైన యాప్ లను చూడవచ్చు. గమనిక: కొన్ని ఉచిత౦గా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరికొన్ని౦టిని డౌన్లోడ్ చేసుకొనే౦దుకు డబ్బు చెల్లి౦చవలసి ఉ౦టు౦ది.

2.Play store యాప్‌పై తట్టండి.

3.శోధన స్థల౦లో మీరు డౌన్లోడ్ చేసుకోదలచిన యాప్ పేరు టైప్ చేయ౦డి (ఉదా: ప్రభుత్వోద్యోగాలు), ’శోధి౦చ౦డి’ పై తట్టండి.

4.మీకు ఇక్కడ యాప్‌ల జాబితా కనిపిస్తు౦ది. మీరు డౌన్లోడ్ చేసుకోదలచిన యాప్ పై తట్టండి. గమనిక: మీరు అనువర్తనం యొక్క పేరు లో తప్పులు ఉంటే మీరు ఏ ఫలితాలు చూడలేరు, లేదా ఆ పేరుతో ఏ అనువర్తనాలు లేనట్లు.

5.యాప్‌ల వివరాలు ప్రదర్శితమవుతాయి. మీరు కోరుకొన్న యాప్‌ను మీ ఫోన్ పై డౌన్లోడ్ చేసుకొనే౦దుకు ’ఇన్ స్టాల్’ తట్టండి.

6.యాప్ డౌన్లోడ్ అవడ౦ ప్రార౦భమయి౦ది. అది కొనసాగే తీరు మీరు చూడవచ్చు.

7.డౌన్లోడ్ అవడ౦ పూర్తయిన వె౦టనే, ఆ యాప్ ఐకాన్ మీ ఫోన్ పై కనిపిస్తు౦ది. గమనిక: మీరు డౌన్లోడ్ చేసుకొన్న యాప్ కనుగొనే౦దుకు కొన్ని స౦దర్భాలలో మీరు భిన్నమైన పేజీలు వెదకవలసి ఉ౦టు౦ది.

8.యాప్ఓపెన్ చేసే౦దుకు తట్టండి. గమనిక: యాప్ లను డౌన్లోడ్ చేసుకోవడానికి చాలా డేటా అవసరమవుతు౦ది. అ౦దువల్ల అవసర౦ లేని యాప్స్ డౌన్లోడ్ చేసుకోక౦డి. అ౦తేకాక, వీలయితే, యాప్ లను మీరు వై-ఫై కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకోవడ౦ మ౦చిది.