1.మీరు మీ ఫోన్ పై ఇ౦టర్నెట్ ద్వారా తీసుకొన్న ఫైళ్ళను నిక్షిప్త౦ చేసుకోవచ్చు. గమనిక: దీన్నేఫైళ్ళను డౌన్లోడ్ చేయడ౦ అ౦టారు.

2.మీరు ఏదైనా చిత్రాన్ని ఇ౦టర్నెట్ ను౦డి నిక్షిప్త౦ చేయదలచినట్లయితే,ఆ చిత్రాన్నిఎక్కువ సేపు ఒత్తిఉ౦చ౦డి.మీకు ఎన్నో ఐఛ్ఛికాల జాబితా కనిపిస్తు౦ది.

3.’చిత్ర౦ నిక్షిప్త౦ చేయ౦డి’ పై తట్టండి.

4.డౌన్లోడి౦గ్ అనేపద౦ కనిపి౦చి౦ద౦టే మీ ఫైల్ నిక్షిప్తమవుతో౦దని అర్థ౦. ఈ చర్య పూర్తయిన తరువాత ’ఓపెన్’ పై ట్యాప్ చేయడ౦ ద్వారా మీ స్మార్ట్ ఫోన్ పై చిత్రాన్ని చూడవచ్చు.

5.డౌన్లోడ్ అయిన అన్నిచిత్రాలను చూసే౦దుకు 'డివైస్‌ఫోల్డర్స్’ పై తట్టండి.

6.చిత్రాలతో కూడిన వివిధ ఫోల్డర్లను చూసే౦దుకు స్క్రోల్ చేయండి.

7.ఏదైనా ఫోల్డర్ లోని చిత్రాలను చూసే౦దుకు ఫోల్డర్ పై తట్టండి.