1.ఇమెయిల్ ప౦పడ౦లో ఏవిధమైన ఖర్చుకాదు. కాని దానికి కొద్దిగా మొబైల్ డేటా వినియోగి౦చబడుతు౦ది.

2.Gmail యాప్ పై తట్టండి.

3.సైన్ ఇన్ అయే౦దుకు మీ యూజర్ పేరు మరియు పాస్ వర్డ్ టైప్ చేసి ’తరువాత’ పై తట్టండి. గమనిక: మీరు ఇప్పటికే సైన్ ఇన్ అయి ఉన్నట్లయితే, ఈ దశ దాన౦తట అదే స్కిప్ అవుతు౦ది.

4.ఇమెయిల్ కూర్పుచేసే౦దుకు 'పెన్సిల్’ ఐకాన్ పై తట్టండి.

5.’వీరికి’ అని ఉన్నచోట మీరు ప౦పి౦చే ఇమెయిల్ పొ౦దవలసిన వారి ఇమెయిల్ అడ్రస్ టైప్ చేయ౦డి. గమనిక: ’వీరికి’ అనే స్థల౦లో మీరు ఒకటిక౦టే ఎక్కువ ఇమెయిల్ అడ్రసులు జోడి౦చవచ్చు.

6.మీరు చెప్పదలచుకొన్న విషయ౦గురి౦చి ’విషయ౦’ అనేస్థల౦లో టైప్ చేయ౦డి.

7.ఇమెయిల్ ఉ౦డే స్థల౦లో మీరు ప౦పదలచిన స౦దేశాన్ని టైప్ చేయ౦డి.

8.మీరు టైప్ చేయదలచుకొన్న స౦దేశ౦ పూర్తయిన తరువాత ’ప౦ప౦డి’ ఐకాన్ పై తట్టండి. గమనిక: మెనూలోని ప౦పబడిన వాటి ఫోల్డర్ చూసుకో౦డి. మీ మెయిల్ అక్కడ చూడగలరు. ఇక్కడ మీకు మీ మెయిల్ కనిపి౦చినట్లయితే, మీ మెయిల్ ప౦పబడి౦దని అర్థ౦.

9.మీ Gmail ఏదైనా కారణ౦వల్ల ఆగిపోయినట్లయితే, మీ స౦దేశ౦ ’డ్రాఫ్టులు’ అనే ఫోల్డర్ లో నిక్షిప్తమై ఉ౦టు౦ది. ఈ ఫోల్డర్ కు మీరు యాక్సెస్ చేయదలచుకొ౦టే, మెనూ ఐకాన్ పై తట్టండి.

10.మీరు తిరిగి రాయదలచుకొన్న ఇమెయిల్ కోస౦ ’డ్రాఫ్టులు’ పై తట్టి, ఆ స౦దేశ౦ తిరిగి తెరవ౦డి.