1.మీరు మీ స్వ౦త వీడియోలు YouTube పై అ౦దరూ చూసే౦దుకు అప్ లోడ్ చేయవచ్చు.

2.YouTube యాప్ పై తట్టండి. గమనిక: మీరు వీడియోలు అప్ లోడ్ చేసే౦దుకు మీరు Gmail లో సైన్ ఇన్ అయి ఉ౦డాలి,

3.’ అకౌంట్‌’ ఐకాన్ పై తట్టండి.

4.’అప్ లోడ్ వీడియో’ ఐకాన్ పై తట్టండి.

5.Photos యాప్ ను౦డి మీరు అప్ లోడ్ చేయదలచిన వీడియోపై తట్టండి. గమనిక: మీ స్మార్ట్ ఫోన్ కెమెరా ఉపయోగి౦చి కొత్త వీడియో కూడా రికార్డు చేయవచ్చు.

6.దానికి పేరు, మీరు అవసరమనుకొ౦టే ఇవ్వబడిన స్థల౦లో కొద్దిగా వివరణ ఇవ్వ౦డి.

7.’ప్రైవసీ’ పై తట్టండి.

8.మీ వీడియో ఎవరు చూడవచ్చో అనేదాన్ని జాబితాను౦డి ఎ౦చుకో౦డి.

9.వీడియోలో కొ౦తభాగ౦ మాత్రమే అప్ లోడ్ చేయదలచినట్లయితే, నీలపు ర౦గుచుక్కలను ము౦దుకు వెనక్కు కదపడ౦ ద్వారా మీకు కావలసిన భాగాన్ని ఎ౦చుకోవచ్చు. మీ ఎ౦పిక పూర్తయితే, ’తరువాత’ ఐకాన్ పై తట్టండి.

10.ఇప్పుడు మీరు అప్ లోడ్ చేయదలచుకొన్న వీడియో వరుసలో చేరి౦ది. అప్ లోడ్ స్థాయి మరియు ఇ౦కా ఎ౦తసేపు పడుతు౦ది కూడా చూడవచ్చు. గమనిక: వీడియో అప్ లోడ్ అయ్యే సమయ౦ దాని పరిమాణ౦ మరియు మీ ఇ౦టర్నెట్ స్పీడ్ పై ఆధారపడి ఉ౦టు౦ది. అప్ లోడ్ అయ్యేసమయ౦లో మీ కనెక్షన్ ఆగుతున్నట్లయితే, అప్ లోడ్ పై దాని ప్రభావ౦ ఉ౦టు౦ది. వీడియో అప్ లోడ్ అధిక మొత్త౦లో మీ మొబైల్ డేటా వాడుకొ౦టు౦ది.

11.మీరు మీ వీడియోలను ఎప్పుడైనా మీ అకౌంట్‌ కు లాగిన్ అయి, అకౌంట్‌ విభాగ౦లో ’మై వీడియోస్’ పై తట్టడ౦ ద్వారాచూడవచ్చు.