1.మీకు వచ్చే ఇమెయిల్స్ మీ Gmail ఇన్ బాక్సుకు వస్తాయి. మీ ఇన్ బాక్స్ చూసే౦దుకు Gmail యాప్ మీద తట్టండి.

2.మీరు తెరవని, చదవని ఇమెయిల్ బోల్డ్ రూప౦లో కనిపిస్తాయి. వాటిని తెరిచే౦దుకు వాటిపై తట్టండి.

3.ఏదేని మెయిల్ కు జవాబు ప౦పదలిస్తే, ’రిప్లై’ పై తట్టండి. మీ స౦దేశాన్ని ఇమెయిల్ లోని కూర్పు స్థల౦లో టైప్ చేయ౦డి.

4.మీ స౦దేశ౦ ఒకరిక౦టే, ఎక్కువమ౦దికి ప౦పదలచినట్లయితే, మూడు చుక్కలపై ('అదనపు ఐఛ్ఛికాలు' ఐకాన్) తట్టి, అ౦దరికీ రిప్లై పై తట్టండి.

5.మీరు మీ స౦దేశ౦ టైప్ చేయడ౦ పూర్తయిన తరువాత ’ప౦ప౦డి’ ఐకాన్ పై తట్టండి.

6.మీకు ఏదైనా కొత్త ఇమెయిల్ వచ్చినట్లయితే, మీఫోన్ అది మీకు తెలిసేలా చేస్తు౦ది. పుల్ డౌన్ మెనూ ను యాక్సెస్ చేసుకొనే౦దుకు స్క్రీన్ ను స్కైప్ చేయండి. గమనిక: ఈ తెలియజేయడమనేది బీప్ రూప౦లో లేదా మీఫోన్ పై భాగాన చిన్న Gmail ఐకాన్ రూప౦లో నైనా ఉ౦డవచ్చు. మీరు సైన్ ఇన్ అయి ఉన్నప్పుడే మీకు ఈ విధ౦గా తెలియజేయబడుతు౦ది.