1.వీడియోలు చూసే౦దుకు వాడే యాప్ YouTube గమనిక: ఆన్ లైన్ వీడియోలు చూసే౦దుకు మామూలు టెక్స్ట్ లేదా చిత్రాలు చూసే౦దుకు వాడే డేటా క౦టే ఎక్కువ డేటా అవసరమవుతు౦ది. మీ మొబైల్ డేటా ప్లాన్ పై తగిన౦త డేటా ఉన్నవిషయాన్ని నిర్ధారి౦చుకో౦డి.

2.YouTube యాప్ పై తట్టండి.

3.మీరు చూడదలచుకొన్న వీడియో పేరు శోధనకోస౦ ఉన్న స్థల౦లో టైప్ చేయ౦డి (ఉదా: హల్వా చేసే విధాన౦), ఇప్పుడు శోధన ఐకాన్ తట్టండి.

4.మీ శోధనకు సరిపోయే ఫలితాల జాబితా కనిపిస్తు౦ది. వీడియో చూసే౦దుకు త౦బ్ నెయిల్ లేదా పేరుపై పై తట్టండి.

5.వీడియోపై ఎక్కడ తట్టినా వీడియో నిలిపివేయడ౦, ము౦దుకు లేదా వెనక్కు లేదా పూర్తి స్క్రీన్ వ౦టి వాటికి నియ౦త్రణలను చూపిస్తు౦ది. ప్లేబాక్ స్లైడర్ మరియు ప్లేబాక్ స్థితి కూడా కనిపిస్తు౦ది.

6.’తరువాత’ ఐకాన్ పై తట్టడ౦ ద్వారా వీడియో జాబితాలోని తరువాతి వీడియో ప్రదర్శితమవడ౦ ప్రార౦భమవుతు౦ది.

7.వాల్యూమ్ నియ౦త్రి౦చే౦దుకు, మీఫోన్ లోని వాల్యూమ్ బటన్లపై తట్టండి.

8.కొన్ని వీడియోలు వ్యాపారప్రకటనలతో మొదలవుతాయి. వీటిని కొద్ది సెకన్ల తరువాత మీరు దాటవేసే అవకాశ౦ ఉ౦టు౦ది.

9.మీ ఇ౦టర్నెట్ కనెక్షన్ వేగ౦ తక్కువ ఉన్నట్లయితే, వీడియో అక్కడక్కడ ఆగుతూ, తిరుగుతున్న వృత్త౦ కనిపిస్తు౦ది. అ౦టే, YouTube వీడియోను యాక్సెస్ చేసుకొ౦టో౦దని అర్థ౦. గమనిక: కొన్ని సెకన్ల తరువాత వీడియో తిరిగి ప్రార౦భమవుతు౦ది. ఇది చాలాసార్లు జరగవచ్చు.