ఆన్ లైన్ ఎలా ఉపయోగించాలో గాయత్రి తన పొరుగున ఉండే లక్ష్మికి నేర్పింది. అప్పటి నుంచి ఆమె బ్యాగ్స్, చీరల జాకెట్ డిజైన్స్ పై పరిశోధన చేస్తోంది- తన కుట్టుపనిలో ఎదగటానికి కావల్సిన ప్రేరేపణ, టెక్నిక్కుల్ని ఆమె గుర్తిస్తోంది. ఆమె ఇప్పుడు తన పనికి మరింత వసూలు చేస్తోంది మరియు అదనంగా వచ్చిన సొమ్ముని తన చదువు కోసం, తల్లి, మరియు ఇటీవల తన కోసం బంగార ఉంగరం కొనుక్కోవటానికి ఉపయోగించింది. చీరల డిజైన్ నుంచి కడుపులో కలిగే అసౌకర్యం వరకు ప్రతీ దాని సమాచారాన్ని కనుగొనటానికి వాయిస్ సెర్చ్ ని ఎలా ఉపయోగించాలో తన ప్రాంతంలో ఉండే చదువురాని వారికి నేర్పిస్తోంది.
ఆన్ లైన్ లో కాలి మడమల పగుళ్లకు తీసుకోవల్సిన జాగ్రత్తల్ని ఆన్ లైన్ లో కనుగొనేలా ఆమె తన పొరుగున ఉన్న మహిళకి సహాయపడింది.

ప్రతీరోజూ ఎక్కువ దూరాలు నడవాల్సి ఉన్న ఆమె పాదాలు పగిలి రక్తం కారుతున్న నేపథ్యంలో ఆమె గాయత్రికి ధన్యవాదములు తెలిపింది.
ఒక సమస్యని ఎలా పరిష్కరించాలో వారు తెలుసుకోవాలని కోరుకుంటే, వాళ్లు చేయాల్సిందల్లా అడగటం.